Saturday, September 7, 2013

International news on August 2013


Taken From Eenadu Pratibha Paper
ఆగస్టు - 2013 అంతర్జాతీయం

ఆగస్టు - 1
¤ బంగ్లాదేశ్ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. మతతత్వ రాజకీయ పక్షంగా పేరొందిన జమాతే ఇస్లామీ పార్టీ చట్ట వ్యతిరేకమైనదని ప్రకటించింది. ఇకపై భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఆ పార్టీని నిషేధించింది.
ఆగస్టు - 2
¤ జింబాబ్వే పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పార్టీ ఘనవిజయం సాధించింది.          » మొత్తం 210 సీట్లకు గానూ, 186 సీట్ల ఫలితాలను ప్రకటించారు. వీటిలో ముగాబేకు చెందిన జాను-పీఎఫ్ పార్టీ 137 సీట్లు గెలిచింది.
ఆగస్టు - 3
¤ అఫ్గానిస్థాన్ జలాలాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం లక్ష్యంగా జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆగస్టు - 4
¤ ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రొహానీ ప్రమాణ స్వీకారం చేశారు.          » భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు వివిధ దేశాల నేతలు హాజరైన ప్రత్యేక కార్యక్రమంలో రొహానీ ఇరాన్ ఏడో అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.
    హసన్ రొహానీ  
ఆగస్టు - 10
¤ జపాన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదేశ రుణ భారం, 1,000,000,000,000,000 యెన్‌లుగా తేలింది. ఆంగ్ల అంకెల పరిభాషలో ఇది అక్షరాలా క్వాడ్రిలియన్ (10.5 ట్రిలియన్ అమెరికా డాలర్లు).
ఆగస్టు - 11
¤ ఎక్కువగా పాలిష్ చేసిన తెల్ల బియ్యం కంటే దంపుడు బియ్యం, ముతక బియ్యమే ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇరి-IRRI) తాజా పరిశోధనలో వెల్లడించింది.          » ఈ నేపథ్యంలో ముతక బియ్యాన్నే తినాలని 'ఇరి', ఇది నెలకొని ఉన్న ఫిలిప్పీన్స్‌లోని ప్రభుత్వం కూడా ప్రజలకు సూచిస్తున్నాయి.          » ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో 'ఇరి ఉంది.          » ఫిలిప్పీన్స్‌లో బియ్యం వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తలసరి సగటు వినియోగం 123 కిలోలకు చేరింది. ఈ విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పైగా ఆ దేశంలోని ప్రజల్లో అత్యధిక శాతం బాగా పాలిష్ పట్టిన, తెల్లని బియ్యం ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల ప్రజారోగ్యం దీర్ఘకాలంలో పాడవుతుందని, మధుమేహం వంటి వ్యాధులు బాగా పెరుగుతాయని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.          » ఏ రకం ధాన్యమైనా రైసు మిల్లుల్లో బాగా మర పట్టించి, తవుడు తీస్తే తెల్లని బియ్యం వస్తాయి. మర పట్టేటపుడు ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల తవుడు అధికంగా వస్తుంది. ఈ విధానం ప్రజారోగ్యాన్ని నాశనం చేస్తోంది. పురాతన కాలంలో ఇళ్లలో ధాన్యాన్ని రోట్లో పోసి రోకళ్లతో దంచేవారు. అపుడు వాటిపై పొట్టు మాత్రమే ఊడిపోయి గోధుమ రంగు బియ్యం (బ్రౌన్) బియ్యం వస్తాయి. వీటిలో థయామిన్, భాస్వరం, విటమిన్-ఎ, వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని ఇరి పరిశోధనలో గుర్తించారు. పైగా ఈ బియ్యంతో వండిన అన్నం మెల్లగా జీర్ణమవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుదల ఎక్కువగా ఉండదు. అదే పాలిష్ చేసిన తెల్లని బియ్యం తింటే ఈ పోషకాలు తగ్గిపోయి, త్వరగా జీర్ణమై గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. మధుమేహం పెరగడానికి ఇదే ప్రధాన కారణం.
ఆగస్టు - 13
¤ నైజీరియాలోని కల్లోలిత పట్టణమైన మైదుగురి కి సమీపంలోని కొండుగ ప్రాంతంలో ఉన్న మసీదులో తీవ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో ప్రార్థనలు చేస్తున్న వారిలో 44 మంది మరణించారు.
ఆగస్టు - 14
¤ ఈజిప్ట్‌లో పదవీచ్యుత అధ్యక్షుడు మహ్మద్ మొర్సీకి మద్దతుగా నిర్వహిస్తున్న శిబిరాలపై సైన్యం జరిపిన కాల్పుల్లో 149 మంది మరణించారు.          » హింసాత్మక ఘటనలు తారస్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి విధిస్తున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
¤ ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ప్రపంచ వ్యాప్తంగా 43.50 కోట్ల సెల్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. వీటిలో 22.50 కోట్ల స్మార్ట్ ఫోన్లు కాగా మరో 21 కోట్లు ఫీచర్ ఫోన్లని పరిశోధన సంస్థ గార్ట్‌నర్ ప్రకటించింది.
          » 2012లో ఇదేకాలంతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 46.5 శాతం పెరిగితే, ఫీచర్ ఫోన్ల విక్రయాలు 21 శాతం తగ్గాయి.          » మొత్తంమీద గతేడాది కంటే ఈసారి సెల్‌ఫోన్ల విక్రయాలు 3.6 శాతం పెరిగాయి.          » స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ఆసియా పసిఫిక్‌లో 74.1 శాతం, లాటిన్ అమెరికాలో 55.7 శాతం, తూర్పు ఐరోపాలో 31.6 శాతం వృద్ధి నమోదైంది.          » స్మార్ట్‌ఫోన్లతో సహా మొత్తం సెల్‌ఫోన్ల విక్రయాల్లో శామ్‌సంగ్ అగ్రస్థానంలో నిలిచింది.
ఆగస్టు - 17
¤ స్విట్జర్‌లాండ్‌లోని మట్టెర్ హార్న్ పర్వతం వద్ద 508 మంది కళాకారులు ఒకేసారి అల్ఫార్న్ ఊది గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. 2009లో 366 మంది ఒకేసారి అల్ఫార్న్‌ని ఊది నెలకొల్పిన రికార్డును వీరు చెరిపేశారు.
¤ జలాంతర్గామి సింధురక్షక్ పేలుడు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న భారత నేవీ అధికారులకు రష్యా నేవల్ ఇంజినీర్లు సహకరిస్తారని రష్యా ప్రభుత్వం వెల్లడించింది.
ఆగస్టు - 19
¤ ఈజిప్టులోని సరిహద్దు నగరమైన రఫాలో మిలిటెంట్లు జరిపిన దాడిలో 25 మంది పోలీసులు మరణించారు.          » ఈజిప్ట్ ఆర్మీ చీఫ్, రక్షణ మంత్రి జనరల్ అబ్దుల్ ఫతా అల్‌సిసీ గత నెల మూడున సైనిక తిరుగుబాటుతో ఈజిప్ట్‌లో అధికారం చేజిక్కించుకున్నారు. మహ్మద్ మొర్సీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికార పగ్గాలు చేపట్టారు.
ఆగస్టు - 20
¤ సిరియాలో అంతర్యుద్ధం అణచివేత పేరుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ మూడు చోట్ల రసాయనిక ఆయుధాలు ప్రయోగించాడని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆరోపిస్తున్న నేపథ్యంలో నిజానిజాలు తేల్చడానికి ఐక్యరాజ్యసమితి నియమించిన ఇరవై మంది సభ్యుల తనిఖీ బృందం సిరియా రాజధాని డమస్కస్ చేరుకుంది.          » సైన్యం మద్దతుతో పోరాడుతున్న కుర్దిష్ సాయుధ బృందాలకీ, అల్‌ఖైదా అండదండలున్న తిరుగుబాటుదారులకు మధ్య సిరియా నైరుతి భాగంలో సంకుల సమరమే జరుగుతోంది. అలెప్పో అనే పట్టణం అంతర్యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉంది.          » సిరియా అంతర్యుద్ధం కరవు కాటకాల నుంచి పుట్టింది. అలెప్పోకు సమీపంలోని దారా అనే గ్రామంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత రెండున్నరేళ్లలో అంతర్యుద్ధం రూపం తీసుకుంది. దుర్బిక్షం సమయంలో దారాలోని పాఠశాల విద్యార్థులు గోడల మీద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాశారు. దీంతో ప్రభుత్వం చాలా కఠినంగా స్పందించింది. విద్యార్థులను అరెస్టు చేసి, దారుణమైన హింసకు గురి చేసింది. ఇది 21వ శతాబ్దంలోనే రక్త పంకిల ఘటనగా పేరు మోసింది. 2009లో ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు చేసిన అధ్యయనం ప్రకారం 8 లక్షల మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు.          » అంతర్యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉన్న నైరుతి ప్రాంతం చమురు వనరులు విస్తృతంగా కలిగి ఉంది. 2011 నుంచి జరుగుతున్న ఈ పోరులో ఇంతవరకు లక్షకు పైగా జనం మరణించారు.          » దేశంలో పోరాడుతున్న తిరుగుబాటు దారులకు కొన్ని విదేశీ శక్తులు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని సిరియా ప్రధాని నూరి అల్‌మాలిక్ ఆక్షేపించారు.          » సిరియా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తిరుగుబాటు దారులను ఆదుకోవాలనే ఆలోచన అమెరికాకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. దీంతో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌లో అల్‌ఖైదాతో పోరాడుతున్న అమెరికా.. సిరియాలో అల్‌ఖైదా మద్దతుదారులకు సాయం చేయడానికి నిర్ణయించినట్లయింది.          » ఐరాస నియమించిన 20 మంది సభ్యుల తనిఖీ బృందానికి అకె సెల్‌స్ట్రామ్ (స్వీడన్ రసాయనిక ఆయుధాల నిపుణుడు) నాయకత్వం వహిస్తున్నారు.
ఆగస్టు - 21
¤ సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని సైన్యం అమాయక పౌరులపై విషవాయువులను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఏకంగా 1300 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో ఎక్కువగా చిన్నారులు ఉండటం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
          » సిరియా రాజధాని డమాస్కస్ చుట్టుపక్కల ఉన్న డ్యూమ, అర్బీన్, ఘౌట నగరాల్లో ఈ ఘోరం జరిగింది.          » సిరియా ప్రభుత్వం రసాయనిక దాడులకు పాల్పడిందని ప్రభుత్వ వ్యతిరేక వర్గ నేత జార్జి సబ్రా ఆరోపించారు. సిరియా స్థానిక సమన్వయ సంఘం కూడా ప్రభుత్వం రసాయనిక దాడులకు పాల్పడిందనే విషయాన్ని ధ్రువీకరించింది.          » రసాయనిక దాడుల ఆరోపణలను సిరియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం దేశంలో రసాయన ఆయుధాలపై తనిఖీలు చేయడానికి వచ్చిన ఐక్యరాజ్యసమితి ప్రతినిధులను తప్పుదోవ పట్టించడానికే వ్యతిరేకులు ఈ ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది.          » గత రెండేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియా రసాయనిక ఆయుధాలకు నిలయమని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి సైన్యం జరిపిన దాడులతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.          » సిరియాలో అంతర్యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. గత కొన్ని రోజులుగా ఇలా ఇరాక్‌కు 30 వేల మందికి పైగా శరణార్థులు వచ్చారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ తాజాగా ప్రకటించింది.          » సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 2011 నుంచి విపక్షాలు, తిరుగుబాటు దళాలు ఉద్యమిస్తున్నాయి. అసద్ వెంటనే గద్దె దిగి ప్రజాస్వామిక సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. రెబల్స్ ప్రభుత్వ బలగాలతో పోరాడుతుండగా, విపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఆందోళన కారులపై ప్రభుత్వ బలగాలు దమనకాండకు దిగుతున్నాయి. నిరసనకారులు కూడా దాడులకు దిగుతుండటంతో ఇరుపక్షాల మధ్య తరచూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతర్యుద్ధంలో ఈ ఏడాది జూన్ నాటికి లక్ష మందికి పైగా చనిపోయారని, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.¤ ఈ సంవత్సరం సెప్టెంబరు 27న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు.          » భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) శివశంకర్ మీనన్, అమెరికా ఎన్ఎస్ఏ సుసాన్ రైస్‌లు వాషింగ్టన్‌లో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆగస్టు - 22
¤ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కాల్పులు పాక్ సైన్యానికి చెందిన కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ మరణానికి దారి తీశాయని తీర్మానంలో పేర్కొంది.          » భారత్‌కు వ్యతిరేకంగా పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన రెండో తీర్మానమిది. గత వారం కూడా ఇదే తరహా తీర్మానాన్ని ఆమోదించింది.
ఆగస్టు - 23
¤ హాంకాంగ్ దేశ చరిత్రకూ, వారసత్వానికీ ప్రతీకగా నిలిచిన 400 ఏళ్ల నాటి ప్రాచీన మర్రి వృక్షాన్ని తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.          » కౌలూన్ పార్క్‌లోని ఈ మహా వృక్షానికి ఫంగస్ డిసీజ్ సోకిన నేపథ్యంలో ఈ వృక్షరాజాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. పార్క్‌లోని ఇతర వృక్షాలకు ఈ వృక్షానికి సోకిన వైరస్ వ్యాపించకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు - 24
¤  పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న 362 మంది భారత జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో 8 మంది బాలురు కూడా ఉన్నారు.
¤  ఈశాన్య నైజీరియా బోర్నో రాష్ట్రంలోని దుంబా గ్రామంలో ఉగ్రవాదులు 44 మందిని గొంతులు కోసి హత్య చేశారు.
          » బోకో హరామ్ ఉగ్రవాద సంస్థ ఈ దుశ్చర్యకు పాల్పడింది. కాల్పులు జరిపితే భద్రతాదళాలు అప్రమత్తమవుతాయనే ఉద్దేశంతో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
¤  బొలీవియాలోని తూర్పు ప్రాంతంలోని శాంతాక్రుజ్ ప్రాంతంలోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మంది మరణించారు.

No comments:

Post a Comment